INCOME TAX
COMPLETE INCOME TAX GUIDE
DDOలకు ముఖ్య గమనిక: TRACES నుండి ఫారం-16 (TDS/TCS) డౌన్‌లోడ్ చేయడం తప్పనిసరి. మాన్యువల్ ఫారం-16 చెల్లదు. నిబంధనలు పాటించని యెడల ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం జరిమానా విధించబడుతుంది.
టాక్స్ పేయర్ సేవలు (Tax Payer Services)
Return Registration
Refund Status
Pay Tax Online
పన్ను గణన - ముఖ్యమైన ఉదాహరణలు
పాత స్లాబ్ రేట్లతో టాక్స్ స్లాబ్స్ మరియు మినహాయింపులు చూద్దాం:
ఉదాహరణ 1: ఒక ఉద్యోగి నికర ఆదాయము 7 లక్షలు ఉంటే, మొదటి 2.5 లక్షలకు పన్ను లేదు. 2.5 నుండి 5 లక్షల వరకు 5% (12,500/-), మిగిలిన 2 లక్షలకు 20% (40,000/-). మొత్తం పన్ను: 52,500/-.
ఉదాహరణ 2: ఆదాయం 12 లక్షలు ఉంటే, నేరుగా 30% లెక్కించకూడదు. స్లాబ్ల ప్రకారం (12,500 + 1,00,000 + 60,000) మొత్తం 1,72,500/- చెల్లించాలి.
మినహాయింపులు & సెక్షన్లు
- Standard Deduction (16ia): జీతం నుండి 50,000/- మినహాయింపు.
- Section 87A: 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 12,500/- వరకు టాక్స్ రిబేట్.
- Section 80C (1.5 లక్షల వరకు): GPF, GIS, LIC, PLI, సుకన్య సమృద్ధి, హోమ్ లోన్ అసలు (Principal) మొదలగునవి.
- Section 10(13A) - HRA: ఇంటి అద్దె మినహాయింపు. 1 లక్ష దాటితే యజమాని PAN ఇవ్వాలి.
- Section 24 - హోమ్ లోన్ వడ్డీ: సొంత ఇంటికి 2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు.
- Section 80D - మెడికల్ ఇన్సూరెన్స్: కుటుంబానికి 25,000/-, సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కి 50,000/- వరకు.
- Section 80CCD (1B): NPS/CPS ద్వారా అదనంగా 50,000/- మినహాయింపు.
ముఖ్యమైన గమనికలు
* అదనంగా హెల్త్ & ఎడ్యుకేషన్ సెన్ 4% చెల్లించాలి.
* ఆదాయంగా పరిగణించబడనివి: రిటైర్మెంట్ బెనిఫిట్స్ (GPF, GIS, GLI), లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ మొదలగునవి.
* ఫిబ్రవరి లోపు Form-12BB సమర్పించాలి. 31 జూలై లోపు ITR ఫైల్ చేయాలి.
PDF GUIDE PREVIEW
Comments
Post a Comment