*REVISED GUIDELINES FOR IMPLEMENTATION OF NEHS - తెలుగు అనువాదంNew Employees Health Scheme - కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సవరించిన మార్గదర్శకాలు
📍PART – I: లబ్ధిదారుల కవరేజ్ / Beneficiary Coverage
1.1 పనిచేస్తున్న ఉద్యోగులు:ఈ పథకం కిందకు వచ్చేవారు:
అన్ని రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్ ఉద్యోగులు
మోడల్ స్కూల్స్, గురుకుల్/రెసిడెన్షియల్ సంస్థల ఉద్యోగులు
ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల ఉద్యోగులు
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు/మార్కెట్ యార్డుల ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వం పరిధిలోని స్టేట్ యూనివర్సిటీల ఉద్యోగులు
ప్రభుత్వ/ప్రభుత్వ సహాయ లైబ్రరీల ఉద్యోగులు
1.2 రిటైర్డ్ ఉద్యోగులు:
అన్ని సర్వీస్ పెన్షనర్లు
ఫ్యామిలీ పెన్షనర్లు
రీ-ఎంప్లాయ్డ్ సర్వీస్ పెన్షనర్లు
1.3 అర్హులైన కుటుంబ సభ్యులు:
ఆధారపడిన తల్లిదండ్రులు - దత్తత లేదా సొంత, రెండూ కాదు
పురుష ఉద్యోగి అయితే ఒక చట్టబద్ధమైన భార్య, స్త్రీ అయితే భర్త
పూర్తిగా ఆధారపడిన పిల్లలు - సొంత, సవతి, దత్తత పిల్లలు
కుమార్తె: అవివాహిత/వితంతువు/విడాకులు తీసుకున్న/వదిలేసిన, ఆధారపడితే
కుమారుడు: 25 సంవత్సరాల వరకు నిరుద్యోగి అయితే
1.4 మినహాయింపులు:CGHS, ESIS, రైల్వేస్, RTC కింద ఉన్నవారు, క్యాజువల్/డైలీ పెయిడ్ వర్కర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కవర్ కారు
📌PART – II: నమోదు మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు
డిజిటల్ నమోదు: IFMIS మరియు ఇతర ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానం ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది
ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్: మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్ ద్వారా QR కోడ్‌తో ఇవ్వబడుతుంది. అన్ని ఎంపానెల్డ్ ఆసుపత్రులు దీన్ని అంగీకరించాలి
🔖PART – III: ప్రయోజనాలు మరియు చికిత్స
3.1 CGHS ఫ్రేమ్‌వర్క్: 2,594 వైద్య మరియు శస్త్రచికిత్సా విధానాలు CGHS రేట్ల ప్రకారం అమలు
3.2 ఆర్థిక కవరేజ్:
ప్యాకేజీలో లేని చికిత్సలకు: ఎపిసోడ్‌కు ₹5.00 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
పాత EHS లో ఇది ₹2.00 లక్షలు మాత్రమే. ఇప్పుడు పెంచారు
₹5 లక్షలు దాటితే EHCT బోర్డ్ అనుమతి కావాలి
3.4 వెల్నెస్ సెంటర్ల ద్వారా OPD చికిత్స:
సాధారణ జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు వెల్నెస్ సెంటర్లలో సేవలు
40 సంవత్సరాలు పైబడిన ప్రతి లబ్ధిదారుడికి ఏటా 1 ఉచిత మాస్టర్ హెల్త్ చెక్-అప్
3.5 OPD మరియు పరీక్షల రాయితీ:ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్ చూపిస్తే ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో OPD మరియు పరీక్షలపై 50% రాయితీ
3.6 ఎంపానెల్డ్ ఆసుపత్రి అందుబాటులో లేకపోతే:
నాన్-ఎమర్జెన్సీ: ₹50,000 వరకు రీయింబర్స్‌మెంట్
ఎమర్జెన్సీ: ₹1,00,000 వరకు రీయింబర్స్‌మెంట్
🍃PART – V: ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్
పాత EHS 435 ఆసుపత్రులు + మెడికల్ రీయింబర్స్‌మెంట్ 508 ఆసుపత్రులు = మొత్తం 943 ఆసుపత్రులు NEHS నెట్‌వర్క్‌లోకి
విజయవాడ, కర్నూలు వంటి రాష్ట్రం వెలుపల ఆసుపత్రులు కూడా ఎంపానెల్ చేయవచ్చు
🔶PART – VII: ఫైనాన్సింగ్ మరియు కంట్రిబ్యూషన్
7.1 కంట్రిబ్యూషన్ స్ట్రక్చర్:ఈ పథకం 2 రకాలుగా నడుస్తుంది:
లబ్ధిదారుల నెలవారీ కంట్రిబ్యూషన్
రాష్ట్ర ప్రభుత్వం సమానంగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్
7.2 పనిచేస్తున్న ఉద్యోగులు:బేసిక్ పే లో 1.5% నెలవారీగా DDO జీతం నుండి కట్ చేస్తారు
7.8 ప్రభుత్వ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్:ఉద్యోగులు కట్టే 1.5% కు సమానంగా ప్రతి నెల 15వ తేదీలోగా ప్రభుత్వం కూడా EHCT ట్రస్ట్ ఫండ్‌కు బదిలీ చేస్తుంది
✳️ఇతర ముఖ్యమైన అంశాలు
ప్యాకేజీ వ్యవధి: అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ తర్వాత 10 రోజుల వరకు. అందులో మందులు, పరీక్షలు, డైట్, ఫాలో-అప్ అన్నీ ఉంటాయి
ఆయుష్ చికిత్సలు: ఆయుర్వేదం మరియు ఇతర గుర్తింపు పొందిన ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కూడా కవర్
అమలు తేదీ: ఎలక్ట్రానిక్ NEHS హెల్త్ కార్డ్ సిస్టమ్ 17.07.2026 నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది
ఫిర్యాదుల పరిష్కారం: 4 స్థాయిలు. 15 పనిదినాల్లో పరిష్కారం. హెల్ప్‌లైన్ కూడా ఉంటుంది
Comments
Post a Comment